హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో పేదలకు ఇళ్లు నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వారికి ఆ పూజలే అష్టదిగ్బంధనంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని, తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.