వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం నేడు విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్, ఈ విజయంతో తన కెరీర్‌లో హ్యాట్రిక్ హిట్స్‌ను నమోదు చేసింది.
రితికా నాయక్ విశ్వక్ సేన్ సరసన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'మిరాయ్' చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల మధ్యలో 'హాయ్ నాన్న'లో అతిథి పాత్రలో మెరిసిన రితికా, ఆ సినిమా విజయంలోనూ భాగమైంది.
మొదటి సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా, 'మిరాయ్'లో సన్యాసిగా విభిన్న పాత్రలు పోషించిన రితికా, 'కొరియన్ కనకరాజు'లో కొరియాపై ఇష్టం ఉన్న అమ్మాయిగా పూర్తిస్థాయి కమర్షియల్ పాత్రలో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ప్రస్తుతం రితికా చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. 'కొరియన్ కనకరాజు' విజయం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.








