తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోమవారంనాడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కొళత్తూరు నియోజకవర్గంలో తనపై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని, ఓటింగ్ యంత్రాలు, వీవీపాట్ ప్రక్రియలో లోపాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఆ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

నియోజక వర్గంలోని 286 వీపీపాట్‌లను వెరిఫికేషన్ చేయాలని, వీవీపాట్ స్లిప్‌లు 100 శాతం లెక్కించాలని, బాబు ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. స్టాలిన్ తనకు కంటుకోటగా ఉన్న కొళత్తూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2026 అనూహ్యంగా టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.