తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీలు, పెన్షన్‌దారుల కోసం కొత్త ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మొత్తం 17.88 లక్షల మందికి ఆరోగ్య భద్రత లభిస్తుంది. ఎంప్లాయీలు, పెన్షన్‌దారుల సహకారంతో ఎంచీటీసీటీ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఈ పథకం కింద లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు 114 ప్రభుత్వ ఆసుపత్రుల్లో నగదు రహిత (కాష్‌లెస్) వైద్య సేవలు పొందవచ్చు. ప్రతి వ్యక్తికి 1,816 రకాల మెడికల్, సర్జికల్ ప్యాకేజీలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
ఈ స్కీమ్‌లో భాగంగా అన్ని రకాల ప్రక్రియలు డిజిటల్ పద్ధతిలోనే జరుగుతాయి. ఎంప్లాయీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను చెల్లిస్తోంది. దీనివల్ల ఎంప్లాయీలు, పెన్షన్‌దారులు సులభంగా వైద్య సేవలను పొందే అవకాశం కలుగుతుంది.







