బెంగళూరు: జైలులో ఉన్న ఖైదీతో మహిళా ఎస్‌ఐ అర్ధనగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో కర్నాటక అసెంబ్లీలో చర్చకు దారితీసింది. ఎస్‌ఐ వీడియోపై ప్రతిపక్షాలు పాలక పక్షాలను నిలదీశాయి. సోమవారం శాసన సభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆ వీడియోపై స్పందించారు.
ఆ వీడియో సంవత్సరం క్రితం వైరల్‌గా మారిందని, సదరు మహిళా ఎస్‌ఐకు నోటీసులు ఇవ్వడంతో పాటు బదిలీ చేశామని వివరణ ఇచ్చారు. ఎస్‌ఐ అర్థనగ్న కాల్ వీడియోను సమర్థించడంలేదని, పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ఎలా అని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెచ్చారని బాధను వ్యక్తం చేశారు. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో మహిళా ఎస్‌ఐ ప్రేమాయణం నడిపించింది.
ఖైదీతో యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసింది. యూనిఫామ్ తీసేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఆ వీడియోను ఖైదీ ఇతరులకు పంపించడంతో వైరల్‌గా మారింది.
దీంతో మహిళా ఎస్‌ఐ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.








