కేరళలోని కన్నూర్‌కు చెందిన ఒక నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్ 2016 నవంబర్‌లో శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించారు. తన వివాహం కోసం రూ. 3,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా, కాసరగోడ్‌కు చెందిన మంచి సంబంధం చూపిస్తామని బ్యూరో హామీ ఇచ్చింది. అయితే, తొమ్మిదేళ్లు గడిచినా బ్యూరో ఎటువంటి సంబంధం కుదర్చలేదు.
ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, ప్రొఫెసర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. కొడుకు పెళ్లి చూడాలని ఆశపడిన ఆయన తండ్రి 2025 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో మరణించగా, తల్లి ఇప్పటికీ ఎదురుచూస్తోంది. బ్యూరో నిర్లక్ష్యంపై విసిగిపోయిన బాధితుడు, సేవాలోపం కింద వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి రూ. 15,000 పరిహారం కోరారు.
కమిషన్ పంపిన నోటీసులకు మ్యారేజ్ బ్యూరో స్పందించలేదు. దీంతో బ్యూరో సేవల్లో లోపం ఉందని నిర్ధారించిన కమిషన్, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,000 తిరిగి ఇవ్వడంతో పాటు, మానసిక వేదనకు రూ. 3,000 మరియు కోర్టు ఖర్చుల కింద రూ. 2,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ఈ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఒకవేళ గడువులోగా చెల్లించకపోతే, ఏడాదికి 9 శాతం వడ్డీతో పాటు వినియోగదారుల రక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.








