కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కోవిడ్-19 పరిస్థితిపై స్పష్టత చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు, వైరస్ వ్యాప్తి, వేరియంట్లపై IDSP, ICMR, సీఎంసీ వేలూరు సంస్థలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నాయని, వర్షాకాలంలో వైరల్ ఫ్లూ కేసులు పెరగడం సహజమని తెలిపారు.
ఈ సీజనల్ ట్రెండ్ గత ఏడాది ఇదే సమయంలో నమోదైన పరిస్థితికి అనుగుణంగా ఉందని, కొత్త వేరియంట్ లేదా తీవ్రత పెరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్రం నొక్కిచెప్పింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కూడా పరిస్థితిని సమీక్షించారు.
అదనపు చర్యలు అవసరం లేదని తెలిపిన కేంద్రం, వృద్ధులు మరియు చాలా కాలంగా ఉన్న వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా జీనోమిక్ సర్వైలెన్స్ ద్వారా రాష్ట్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.








