హైద‌రాబాద్‌: ద గ్రేట్ ఇండియ‌న్ క్రికెట్ ఫెస్టివ‌ల్‌ను జియోస్టార్ ప్ర‌క‌టించింది. నాలుగు దేశాలతో జ‌రిగే హోం సిరీస్ క్రికెట్ సీజ‌న్‌పై జియోస్టార్ ప్ర‌క‌ట‌న చేసింది. వెస్టిండీస్‌, శ్రీలంక‌, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో జ‌రిగే సిరీస్‌ల‌ను జియోస్టార్ ప్రసారం చేయ‌నున్న‌ది.

సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి ఈ క్రికెట్ సీజ‌న్ ప్రారంభంకానున్న‌ది. మార్చి 3, 2027 వ‌ర‌కు ఈ సీజ‌న్ కొన‌సాగ‌నున్న‌ది. వ‌న్డేలు, టీ20లు, టెస్టుల‌కు చెందిన 22 మ్యాచ్‌ల‌ను జియోహాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ నెట్వ‌ర్క్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు.

వెస్టిండీస్‌, శ్రీలంక‌, జింబాబ్వేతో వ‌న్డే ద్వైపాక్షి సిరీస్‌ను ఇండియా ఆడ‌నున్న‌ది. 2027లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఈ సీజ‌న్ ప్రిపరేష‌న్ కానున్న‌ది. ఇక ఆస్ట్రేలియాతో జ‌రిగే అయిదు మ్యాచ్ బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీని కూడా జియోస్టార్ ప్రసారం చేయ‌నున్న‌ది.

జ‌న‌వ‌రి 21 నుంచి మార్చి 3వ తేదీ వ‌ర‌కు ఈ సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ది. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో ఈ సిరీస్‌ కీల‌కంగా మార‌నున్న‌ది. జియోస్టార్ సేల్స్ హెడ్ అనూప్ గోవింద‌న్ మాట్లాడుతూ..

క్రికెట్ ఫెస్టివ‌ల్ సీజ‌న్ వ‌రుస‌గా అయిదు నెల‌లు కొన‌సాగుతుంద‌ని అన్నారు.