Telugu » Technology » Jio Rs 495 Vs Airtel Rs 489 Prepaid Recharge Which Plan Offers Better Validity And Benefits

Jio vs Airtel : మీకు జియో లేదా ఎయిర్‌టెల్ ఏది ఫేవరెట్.. మీ బడ్జెట్ రూ.500 లోపు అయితే ఇది మీకోసమే.. మంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ కోసం చూస్తుంటే ఇంతకన్నా బెటర్ ప్లాన్లు దొరకవు. జియో రూ.495 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.489 ప్లాన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఈ రెండు ప్లాన్‌ల మధ్య వ్యాలిడిటీ, డేటా, కాలింగ్, అదనపు బెనిఫిట్స్ పరంగా భారీ తేడా ఉంటుంది. అయితే, ఈ రెండు నెట్‌వర్క్‌లలో ఏ ప్రీపెయిడ్ ప్లాన్ (Jio vs Airtel) తీసుకుంటే బెటర్? వ్యాలిడిటీ, బెనిఫిట్స్ పరంగా ఎందులో బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జియో రూ.495 ప్లాన్‌ ఏంటి? : జియో రూ.495 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 1.5GB డేటాతో పాటు అదనంగా 5GB డేటా అందుతుంది. అంటే.. మొత్తం 47GB డేటా వాడుకోవచ్చు. అంతేకాదు.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి.

అదనపు బెనిఫిట్స్ విషయంలో జియోనే ఫస్ట్. 18 నెలల గూగుల్ జెమిని ప్రో (రూ. 5,100 విలువైన)తో 5,000GB క్లౌడ్ స్టోరేజ్, నానా బనానా వంటి ఏఐ బెనిఫిట్స్ అందిస్తుంది. జియోటీవీ, జియోఏఐక్లౌడ్, జియోగేమ్స్, క్లౌడ్, ఫ్యాన్ కోడ్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.489 ప్లాన్ : ఎయిర్‌టెల్ రూ.489 ప్లాన్‌లో 77 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 6GB డేటా, 600 SMS బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అలాగే లోకల్, STD, రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అదనంగా 12 నెలల సుమారు రూ. 4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేఫ్ నెట్ వర్క్, ఫ్రీ హాలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే యాక్సెస్ లభిస్తుంది.

ఏది బెస్ట్? ఎక్కువ వ్యాలిడిటీ, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే యూజర్లకు ఎయిర్‌టెల్ రూ.489 బెస్ట్ ఆప్షన్. కేవలం రూ.489కే 77 రోజుల వ్యాలిడిటీతో రావడం మెయిన్ ప్లస్ పాయింట్. అయితే, రోజువారీ ఎక్కువ డేటా, ఏఐ బెనిఫిట్స్ కావాలంటే మాత్రం జియో రూ.495 ప్లాన్ తీసుకోవడమే బెటర్.