జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.

భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ మ్యాచ్ తొలి బంతికే బ్రయాన్ బెనెట్‌ను డకౌట్ చేసి జింబాబ్వేను దెబ్బతీశాడు. ఆ తర్వాత బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, కెప్టెన్ సికిందర్ రజా త్వరగానే వెనుదిరగడంతో జింబాబ్వే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో వెస్లీ మద్వీర 39 పరుగులు, ర్యాన్ బర్ల్ 26 పరుగులు, మరుమాని 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఆదుకున్నారు. మద్వీర, మరుమాని ఆరో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జింబాబ్వే స్కోరు 100 పరుగులు దాటింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, శివమ్ దూబె, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా, 126 పరుగుల లక్ష్యంతో ఛేదనను ప్రారంభించింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి రాగా, తొలి ఓవర్‌లో భారత్ రెండు పరుగులు సాధించింది.