ఇంగ్లండ్ టీ20 పర్యటన తర్వాత వైభవ్ సూర్యవంశీ భారత్‌కు తిరిగి వచ్చి రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ ప్రారంభించాడు. హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత నెట్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో . రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను 'బ్యాక్ టు వర్క్' అనే క్యాప్షన్‌తో పంచుకుంది.

జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అతనికి స్వాగతం పలికిన సన్నివేశం అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో అతను భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులకే పరిమితమయ్యాడు. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కొనే విషయంలో అతని బ్యాటింగ్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.