జూలై 9న హైదరాబాద్ మలక్‌పేటలో నివసిస్తున్న ఒక బాలిక తన అమ్మమ్మ ఇంటికి అడ్డగూడూరు మండలంలో చేరుకుంది. ఈ సమయంలో చైతన్య అనే యువకుడు ఇంటి గోడ దూకి ప్రవేశించి బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ సంఘటన గుర్తించిన అమ్మమ్మ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడిని అరెస్టు చేయకపోవడంపై అమ్మమ్మ తీవ్ర ఆరోపణలు. కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొంది. అయితే, సబ్ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేయబడిందని, నిందితుడిని రిమాండ్‌కు పంపడానికి నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందని వివరించారు.
జూలై 13న భరోసా సెంటర్ ద్వారా బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం, బాలిక అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీస్ బృందాలు బాలిక మరియు చైతన్య కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.







