IND vs SL : కొలంబో టెస్టులో శ్రీ‌లంక పోరాడుతోంది. ప్ర‌సిధ్ కృష్ణ‌(3-46), మాన‌వ్ సుతార్‌(2-71)ల విజృంభ‌ణ‌తో ప్ర‌ధాన‌ ఆట‌గాళ్లు పెవిలియ‌న్ చేర‌గా ఫాల్ ఆన్ ప్ర‌మాదంలో ప‌డింది లంక‌. భోజ‌న విరామం త‌ర్వాత వెంట‌వెంట‌నే మూడు వికెట్లు ప‌డినా.. సోనాల్ దినుష‌(52 నాటౌట్) అర్ధ శ‌త‌కంతో మెరిశాడు. ఎనిమిదో వికెట్‌కు కేశ‌ర నువాంత‌(13 నాటౌట్)తో అత‌డు కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పగా టీ స‌మ‌యానికి ఆతిథ్య జ‌ట్టు 216జ‌7 స్కోర్ చేసింది.

తొలి రెండో రోజులు భార‌త జ‌ట్టు ఆధిప‌త్యం చెలాయించగా.. మూడో రోజు శ్రీ‌లంక ఆట‌గాళ్లు పోరాడుతున్నారు. తొలి సెష‌న్‌లోనే ప్ర‌సిధ్ కృష్ణ‌(3-46) రెండు వికెట్ల‌తో లంక‌ను దెబ్బ‌కొట్టినా ప‌సిందు సూర్య‌బండార‌(80) ఆదుకున్నాడు. టెస్టుల్లో మొదటి అర్ధ శ‌త‌కంతో అత‌డు మెర‌వ‌గా.. లంచ్ త‌ర్వాత భార‌త బౌల‌ర్లు ట‌క‌ట‌కా మూడు వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు.

That’s Tea on Day 3 of the second #SLvIND Test!

Sri Lanka 7 down as #TeamIndia picked 3⃣ wickets in the Second Session! 👍 👍

We will be back for the Final Session of the Day shortly!

కుదురుకున్న ప‌సింద్‌ను జ‌డేజా బౌల్డ్ చేసి బ్రేకివ్వ‌గా.. సిరాజ్‌, మాన‌వ్ చెరొక వికెట్ తీయ‌గా కాసేప‌ట్లోనే లంక ఆలౌట‌వ్వ‌డం ఖాయ‌మ‌నిపించింది. కానీ, అడ్డుగోడ‌లా నిలిచిన‌ సోనాల్ దినుష‌(52 నాటౌట్) క్రీజునంటుకున్నాడు. టీమిండియా పేస‌ర్లు, స్పిన్న‌ర్ల‌ను స‌మ‌ర్దంగా ఎదుర్కొన్న అత‌డు.. నువాంత‌(13 నాటౌట్)తో క‌లిసి కీల‌క స్కోర్ రెండొంద‌లు దాటించాడు.