హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు.

శివశంకర నాయుడు వైతో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పక్షి కాళ్లను చూపిస్తూ, ‘ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్‌ను మీరు ఊహించలేదు..’అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది.

ఒక కొత్త తరహా కథను స్క్రీన్ మీద చూపించబోతున్నారనే ఆసక్తి అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో అందరిలో కలుగుతోంది.