హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ వైద్యులపై సిటీ పోలీసులు దాడులు చేశారు. 11 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ వైద్యులు డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తున్నారు. నకిలీ వైద్యులు పలు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో వైద్యం చేయడంతో పాటు అర్హతలు లేకుండానే వైద్య సేవలు అందిస్తున్నట్టు గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపారు.