హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు మెరుపు దాడులు నిర్వహించాయి. మొత్తం 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సిపి సజ్జనార్ వెల్లడించారు.
ఈ దాడుల్లో 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి నిత్యావసర మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు.








