ఖైదీ, విక్రమ్, కూలీ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకున్న లోకేష్ కనగరాజ్, ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' మూవీ తమిళం మరియు తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, నటుడిగా ఆయనకు క్రేజ్ పెరిగింది.

అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ చేయాల్సిన 'రాకా' సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో తన హీరో ఇమేజ్‌ను కొనసాగించాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే 'రాకా' విడుదలయ్యేలోపు మరో సినిమాను పూర్తి చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.

ఈ కొత్త సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేసేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫాస్ట్ షెడ్యూల్‌లో షూటింగ్ ముగించి, మరో కొత్త దర్శకుడితో ఈ ప్రాజెక్టును తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం ద్వారా 'రాకా' కంటే ముందే మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని లోకేష్ యోచిస్తున్నారు.