ప్రపంచ హాకీ టోర్నమెంట్ నుంచి భారత పురుషుల జట్టు నిష్క్రమించింది. సెమీ ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. సోమవారం అర్జెంటీనాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 35 గోల్స్ తేడాతో పరాజయం చవిచూసింది.

దీంతో సెమీస్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. లీగ్ దశలో అద్భుత ఆటతో అలరించిన భారత్ రెండో రౌండ్‌లో మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. ఇంతకుముందు మహిళా జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

తాజాగా పురుషుల జట్టు కూడా పతకం లేకుండానే వైదొలిగింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సుఖ్‌జీత్ రెండు, హార్దిక్ సింగ్ ఒక గోల్ సాధించారు.

అర్జెంటీనా జట్టులో జోక్విన్, డొమెనె రెండేసి గోల్స్ చేశారు. టోర్నేకు ఒక గోల్ దక్కింది.