ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు జూన్ 30న విడుదల అవుతాయి. ఈనెల 30వ తేదీకి జరిగిన పరీక్షల్లో 3.29 లక్షల మంది హాజరయ్యారు.
ఇంటర్ మార్కులకు 25 శాతం, EAPCET మార్కులకు 75 శాతం వెయిటేజీతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు నిర్ణయిస్తారు. సీబీఎసీ రివైజ్డ్ ఫలితాలు పూర్తయ్యేవరకు విడుదల ఆలస్యం అయింది.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో cets.apsche.ap.gov.in సైట్ ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.







