ఏషియన్ గేమ్స్ - 2026 క్రీడలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
పురుషుల క్రికెట్ విభాగంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్-ఫైనల్స్‌కు చేరుకున్నాయి. గ్రూప్-ఎలో అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో హాంగ్‌కాంగ్-చైనా, మలేషియా, ఒమన్ జట్లు పోటీ పడనున్నాయి.
భారత్, పాకిస్థాన్ జట్లు తమ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌ల్లో గెలిస్తే, అక్టోబర్ 1న జరిగే సెమీ-ఫైనల్‌లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం ఉంది. ఈ పోటీలు క్వార్టర్-ఫైనల్స్‌తోనే నేరుగా మొదలవుతాయి.
మహిళల విభాగంలో భారత్, జపాన్, బంగ్లాదేశ్, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒక గ్రూప్‌లో ఉన్నాయి. పాకిస్థాన్, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు మరో గ్రూప్‌లో పోటీ పడనున్నాయి. ఈ విభాగంలో కూడా పోటీలు క్వార్టర్-ఫైనల్స్‌తోనే ప్రారంభం కానున్నాయి.








