బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక' సినిమా హిందీలో డబ్ చేసి YouTubeలో విడుదల చేసిన తర్వాత 1 బిలియన్ (వంద కోట్ల) వ్యూస్ సాధించింది. ఇది భారతీయ సినిమా చరిత్రలో YouTubeలో అత్యధిక వ్యూస్ పొందిన మొదటి సినిమా అయ్యింది.

ఈ సినిమా కాక, శ్రీనివాస్ నటించిన 'కవచం' (సుమారు 800 మిలియన్ల వ్యూస్), 'సీత' (700 మిలియన్ల వ్యూస్) సినిమాలు కూడా హిందీ YouTube ఛానల్స్లో పెద్ద సంఖ్యలో వ్యూస్ సాధించాయి. ఈ విజయాలతో హిందీ రూరల్ ప్రాంతాల్లో అతనికి మాస్ హీరోగా పేరు వచ్చింది.

ఈ రికార్డ్ చూసి హిందీ మార్కెట్ పట్ల ఆసక్తి కలిగిన శ్రీనివాస్, ప్రభాస్ ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయింది. ఇప్పుడు ఈ 1 బిలియన్ వ్యూస్ సాధనతో మళ్లీ హిందీ సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడేమో చూడాలి.