యూట్యూబర్ దొరసాయి తేజ ప్రధాన పాత్రలో నటించిన 'దందా' సిరీస్ ఛాయ్ షాట్స్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో మొత్తం 29 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు రెండున్నర నిమిషాల నిడివితో సాగుతుంది.
ఈ సిరీస్ కథ అరవింద్ అనే బీటెక్ విద్యార్థి చుట్టూ తిరుగుతుంది. డబ్బు, అధికారం కోసం ఆశపడే అరవింద్, సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. చిన్నపాటి ఆన్‌లైన్ మోసాలతో మొదలైన అతని ప్రయాణం, ఫిషింగ్ స్కామ్‌లు, కాల్ సెంటర్ల నిర్వహణ, బ్లాక్‌మెయిల్స్ మరియు గ్యాంగ్‌స్టర్ రాజకీయాల వరకు ఎలా విస్తరించింది అనేదే ఈ కథాంశం.
అరవింద్ పాత్రలో దొరసాయి తేజ రా అండ్ రఫ్ నెగిటివ్ షేడ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న నటన అరవింద్ పాత్రకు గట్టి పోటీనిస్తుంది. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మేకింగ్, రిషి ఎం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అశ్విన్ లెనిన్ విజువల్స్ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.
నితిన్ ప్రసన్న పోషించిన ఆదిత్య సింగ్ పాత్ర, ఈ సిరీస్ రెండో సీజన్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా సాగుతుంది. డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌ను శాసించే స్థాయికి అరవింద్ ఎలా ఎదిగాడనేది ఈ సిరీస్ ముగింపు వరకు ఆసక్తికరంగా ఉంటుంది.








