సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు దీక్ష విరమింపజేశారు. రాజ్యసభ ఎంపీ లక్ష‍్మణ్ నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు బకాయి -బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (మంగళవారం) దీక్ష విరమింపజేశారు.

కాగా నిన్నటి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో రాంచదంర్‌ రావు ఆరోగ్యం క్షీణించిందన వైద్యులు తెలిపారు. బీపీ డౌన్ అయిందంటున్న గ్లూకోజ్ ఎక్కించుకోవాలి అంటూ రాంచందర్ రావుకి వైద్యులు సూచన చేశారు. అయినప్పటికీ రాంచందర్‌ రావు దీక్ష కొనసాగించారు. అనంతరం మద్యాహ్నం సమయంలో దీక్ష విరమింపజేశారు.