నాని నటిస్తున్న కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా నేడు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి హాజరయ్యారు.

ఈ ప్రెస్ మీట్ కోసం వచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి ముగ్గురూ నల్ల రంగు దుస్తుల్లో కనిపించడం గమనార్హం. సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ కార్యక్రమంలో నాని సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆయన ఫుల్ హెయిర్‌తో పవర్ ఫుల్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్‌తో సినిమా ప్రమోషన్లు అధికారికంగా మొదలయ్యాయి.