సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో కొత్త సంబరాలు మొదలయ్యాయి. మహేశ్ బాబు మేనల్లుడు, గుంటూరు మాజీ ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడైన సిద్ధార్థ్ గల్లా, సౌత్ కొరియా అమ్మాయి హ్యేఇన్ కిమ్‌తో నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో సిద్ధార్థ్ మరియు హ్యేఇన్ కిమ్ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థం ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. 'మీ భవిష్యత్తు సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. సిద్ధార్థ్ తండ్రి జయ







