సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా, కారంగా తింటూ టీ తాగాలనిపించడం సహజం. ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలి వీస్తున్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు బయటి ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లోనే అప్పటికప్పుడు వేడిగా ఏదైనా చేసుకుంటే ఆ మజాయే వేరు. అలాంటి సమయాల్లో వంటింట్లో ఉండే సాధారణ అటుకులు, ఉల్లిపాయలతో కేవలం ఐదు నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ రుచితో ఎంతో కరకరలాడే 'అటుకుల స్నాక్' తయారు చేసుకోవచ్చు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ క్విక్ ఈవెనింగ్ స్నాక్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.







