ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'వారణాసి' చిత్రాన్ని ఐమ్యాక్స్ మరియు ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లపై అద్భుతమైన దృశ్యాలతో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు భారీ పోటీ ఎదురుకానుంది.
'వారణాసి' విడుదల సమయానికి హాలీవుడ్ చిత్రాలైన 'గాడ్జిల్లా x కాంగ్: సూపర్‌నోవా', 'పానిక్ కేర్‌ఫుల్లీ' థియేటర్లలో ప్రదర్శనలో ఉండనున్నాయి. సాధారణంగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు ప్రీమియం స్క్రీన్లను నెలల ముందే బుక్ చేసుకుంటాయి. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఐమ్యాక్స్ వంటి ప్రీమియం థియేటర్ స్లాట్లను దక్కించుకోవడం ఈ చిత్రానికి పెద్ద సవాలుగా మారింది.
ఈ హాలీవుడ్ చిత్రాలతో పోటీని తట్టుకుని, గ్లోబల్ మార్కెట్‌లో 'వారణాసి'కి తగినన్ని థియేటర్లను ఎలా కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ స్థాయి పోటీని రాజమౌళి ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాలి.







