దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ LIC వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని తొలగించింది. ఈ మార్పు కారణంగా పాలసీదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం LIC ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లో UPI, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ మాత్రమే చెల్లింపు మార్గాలుగా కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తొలగింపుకు బిల్‌డెస్క్ సర్వీస్ ఛార్జీలు కారణమని ఏజెంట్లు అంటున్నారు. LIC ఈ విషయంలో పేమెంట్ గేట్‌వే సంస్థతో విభేదాలు ఉన్నట్లు సమాచారం.
కొత్త పేమెంట్ గేట్‌వే సంస్థతో చర్చలు జరుగుతున్నాయని ఏజెంట్లు తెలిపారు. ఈ చర్చలు విజయవంతమైతే క్రెడిట్ కార్డ్ చెల్లింపు సదుపాయం తిరిగి వచ్చే అవకాశం ఉంది.







