సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై నటి అనుపమ పరమేశ్వరన్ స్పష్టత ఇచ్చారు. గత ఏడాది తాను చాలా కష్టమైన సమయాన్ని గడిపానని, ఆ సమయంలో తనను తాను కోల్పోయినట్లు అనిపించిందని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తాను తన ప్రాధాన్యతలను మార్చుకున్నానని అనుపమ తెలిపారు. తన జీవితంపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించానని, తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టానని ఆమె వెల్లడించారు.
ప్రస్తుతం తాను ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని అనుపమ చెప్పారు. గతాన్ని వదిలేసి ముందుకు సాగుతున్నానని ఆమె తెలిపారు. కొన్ని వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడమే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.








