బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు గురువారం మీడియా సమావేశంలో హైదరాబాద్‌లోని బిజెపీ కార్యాలయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాగా భారతదేశంలో కూడా అశాంతి, హింసను సృష్టించేందుకు కొన్ని అల్ట్రా-లెఫ్ట్, సాఫ్ట్-లెఫ్ట్ సంస్థలు 'కాక్రోచ్ జనతా పార్టీ' వంటి వేదికలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉద్యమాలకు ఖలిస్తాన్ శక్తుల నుండి రూ. 10 కోట్లు, కతార్, కెనడా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుండి ఆర్థిక మద్దతు లభిస్తున్నట్లు ఆయన ఆధారాలతో తెలిపారు. పుణే, ముంబై, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమాల వెనుక ఈ శక్తుల హస్తం ఉందని ఆరోపించారు.

NEET పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న వెబ్‌టోన్ ప్లాట్‌ఫారమ్‌ను తక్షణమే స్పాండ్ చేసి 31 మందిని అరెస్ట్ చేసినట్లు రామచంద్ర రావు వివరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అనుకూల వ్యక్తులే ఈ లీక్‌కి కారణమని తెలిసిందని పేర్కొన్నారు.

2014కి ముందు UPA పాలనలో 53కి పైగా ప్రధాన పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, 2005-2014 మధ్య CSE, AIIMS, RRB వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో లీక్‌లు జరిగాయని ఆయన ఆధారాలు చూపారు. ఆ సమయంలో కాంగ్రెస్ లేదా నాన్-బిజెపీ ప్రభుత్వాల విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేసారా అని ప్రశ్నించారు.