బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదో సీజన్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి 'దశావతారం' అనే కాన్సెప్ట్‌తో కొత్త తరహా టాస్కులు, నిబంధనలతో షోను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సామాన్యుల కోసం నిర్వహిస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే పదో సీజన్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. దీంతో ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ షోలో గొడవలు, టాస్కులతో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా చాలా ముఖ్యం. గతంలో ఇమ్మాన్యుయేల్, ముక్కు అవినాష్, రోహిణి, ఫైమా వంటి జబర్దస్త్ కమెడియన్లు ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యంలో పదో సీజన్‌లో కూడా జబర్దస్త్ నటులకు ప్రాధాన్యత ఉండనుంది.
ఇప్పటికే రామ్ ప్రసాద్ పేరు కన్ఫార్మ్ లిస్టులో ఉండగా, ఇప్పుడు పొట్టి నరేష్ పేరు కూడా చేరింది. గుంటూరు జిల్లాకు చెందిన నరేష్ శారీరక ఎదుగుదల లోపం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే తన రూపాన్ని సానుకూలంగా మార్చుకుని జబర్దస్త్ షోలో టీమ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నరేష్‌ను బిగ్ బాస్ లోకి తీసుకుంటే ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకోసం మేకర్స్ ఇప్పటికే నరేష్‌ను సంప్రదించగా, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.








