iQOO 15 ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధరను కంపెనీ ఏకంగా రూ.13,000 వరకు పెంచింది. గతంలో రూ.72,999 ప్రారంభ ధరతో వచ్చిన 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.85,999కు చేరింది. అలాగే 16GB RAM + 512GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.79,999 నుంచి రూ.93,999కు పెరిగింది.

iQOO 15R మోడల్ ధరలోనూ మార్పులు వచ్చాయి. గతంలో రూ.44,999కు లభించిన 8GB RAM + 256GB వేరియంట్ ఇప్పుడు రూ.53,999గా ఉంది. దీనితో పాటు 12GB + 256GB వేరియంట్ రూ.59,999కు, 12GB + 512GB వేరియంట్ రూ.66,999కు అందుబాటులో ఉన్నాయి.

iQOO Neo 10 సిరీస్‌లో 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ.33,999 నుంచి రూ.43,999కు పెరిగింది. అయితే, గతంలో రూ.31,999కు లభించిన 8GB RAM + 128GB బేస్ వేరియంట్ అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. ఇటీవల వన్‌ప్లస్, వివో, ఒప్పో వంటి ఇతర కంపెనీలు కూడా తమ ఫోన్ల ధరలను పెంచిన నేపథ్యంలో, ఇప్పుడు iQOO వినియోగదారులు కూడా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.