భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గురువారం రాత్రి 60 ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి, బాలికను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థినికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గురుకులం అధికారులు విచారణను ప్రారంభించారు.

విద్యార్థినికి ఆ ట్యాబ్లెట్లు ఎలా లభించాయి, ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, బాలిక మానసిక పరిస్థితిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.