దాతల నుంచి సేకరించిన అవయవాలు శరీరానికి దూరమైన కొద్ది గంటల్లోనే పాడైపోతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది అవయవాలను మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, మంచులా గడ్డకట్టకుండా చల్లబరుస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతుల్లో అవయవాలను మార్పిడి చేయడానికి శస్త్రచికిత్స నిపుణులకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఈ కొత్త పరికరం ద్వారా అవయవాలను రోజుల తరబడి భద్రపరచడం సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

పంది మూత్రపిండాలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ పరికరం ఆశించిన ఫలితాలను ఇచ్చింది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యే అవకాశాలు మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.