AUS vs BAN : చరిత్రాత్మక విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఆరంభించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఊహించని విధంగా తడబడుతోంది. మెక్‌కేలో తొలి సెషన్ మొదలైందో లేదో మిచెల్ స్టార్క్(5-10) నిప్పులు చెరిగాడు. బంగ్లా బ్యాటర్లను క్రీజులో నిలవకుండా.. వికెట్ల వేటతో భయపెట్టాడీ పేసర్. దాంతో.. నలుగురు డకౌటవ్వగా 12 పరుగులకే సగం మంది డగౌట్ చేరారు.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా కాసేపటికే మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకుంది. విజయోత్సాహంతో బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్‌ను మిచెల్ స్టార్క్(5-10) ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(0)ను ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో వరస బంతుల్లో గత మ్యాచ్ సెంచరీ హీరో తంజిద్ హసన్(0), నకెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(0)లను వెనక్కి పంపాడు స్టార్క్.
Five wickets in just 22 balls for Mitch Starc 💥 #AUSvBAN pic.twitter.com/Owmcf9DqbQ
మెయిడెన్ ఓవర్లతో బంగ్లాను బెంబేలెత్తించిన ఈ స్పీడ్‌స్టర్ కాసేపటికే మొమినుల్ హక్(9), లిటన్ దాస్(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో, చూస్తుండగానే 12 పరుగులకే సగం మంది బ్యాటర్లు వెనుదిరిగారు. కమిన్స్ ఓవర్లో ముష్ఫికర్ రహీం(5) ఔటవ్వగా ఆరో వికెట్ కోల్పోయింది పర్యాటక జట్టు. ప్రస్తుతం మెహిది హసన్ మిరాజ్(4), హసన్ మహమూద్(3)లు క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లకు స్కోర్.. 34-6.








