విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. ఈ క్రేజీ ఫ్యామిలీ డ్రామాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రమోషన్లను వేగవంతం చేశారు.
సోమవారం నుంచి ఈ సినిమాలోని పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా వెంకటేష్ పోషిస్తున్న 'చిట్టి బాబు' పాత్రను పరిచయం చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, యువిన్ పార్థవి, రాజా ప్రజ్వల్ వెంకటేష్ కుటుంబ సభ్యులుగా నటిస్తుండగా, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.








