వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో టైటిల్ పట్ల మిశ్రమ స్పందనలు వచ్చాయి.

ఆంధ్ర ప్రాంతం నెటిజన్లు 'ఇదేం భాష?', 'సబ్‌టైటిల్స్ అవసరమా?' అని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే, తెలంగాణ వారు దీనిని తమ మాండలికం సాంస్కృతిక గుర్తుగా భావించారు.

ఈ చర్చలో తెలంగాణ భాషా నిపుణులు, రచయితలు గరికపాటి నరసింహారావు గతంలో చేసిన వ్యాఖ్యలను రీమైండ్ చేశారు. 'తెలంగాణ మాండలికం వ్యాకరణపరంగా బలమైనది', 'పాత తెలుగు పదాలు ఇక్కడ ఇంకా జీవిస్తున్నాయి' అని ఆయన గతంలో పేర్కొన్నారు.

ఈ పదం తెలంగాణ గ్రామీణ జీవితంలో ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కోర్టు కేసులకు బదులుగా గ్రామ పెద్దల ముందు రాసుకునే వివాహ విడాకు ఒప్పందాన్ని ఇది సూచిస్తుంది. సినిమా టైటిల్ ద్వారా ప్రాంతీయ భాషా సంపదను కాపాడాలని సినిమా రంగ ప్రముఖులు సందేశం ఇవ్వుతున్నారు.