న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బీజేపీ ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ధ్రువీకరించింది.

ఇప్పటివరకు కురియన్ మైనార్టీ వ్యవహారాల శాఖతోపాటు మత్స, పాడి, పశుపోషణ శాఖలను కూడా సహాయ మంత్రి హోదాలో నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియన్ మాత్రమే. ఆయన రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగిసింది. మరో మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను కూడా ఈసారి పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయని విషయం తెలిసిందే.