ఓక్లహోమా హైవే పెట్రోల్‌లో ట్రూపర్ నుండి మేజర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసిన లాన్స్ ష్రోయర్‌కు అమెరికన్ మెరైన్ కార్ప్స్ అనుభవం ఉంది.

ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అతని నైపుణ్యం గతంలో '287(జీ) ఒప్పందాలను' విస్తరించడంలో కీలకంగా పనిచేసింది.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసీఈ చర్యలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. గత 500 రోజుల్లో నిర్బంధ కేంద్రాల్లో దాదాపు 52 మంది మరణాలు, వైద్య సహాయం లేకపోవడం వంటి ఆరోపణలు బయటపడ్డాయి.

ఈ నియామకాన్ని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రకటించారు. ష్రోయర్‌కు నేరస్థులైన అక్రమ వలసదారులను నిర్బంధించి, దేశం నుండి తొలగించే అధికారాలు ఉంటాయని అతను పేర్కొన్నారు.

విమర్శలను పట్టించుకోకుండా, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే నిర్ణయంతో ట్రంప్ ఈ నియామకాన్ని తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.