తెలంగాణ ప్రభుత్వం పేద క్రైస్తవులకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ఆర్థిక సహాయ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద కుట్టు మిషన్లు, ఈ బైక్లు, ఈ స్కూటీలు, మోటార్ బైక్లు, చిన్న కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు, ఫ్యాన్సీ స్టోర్లు వంటి యూనిట్లను సబ్సిడీతో అందిస్తుంది.
అర్హులైన అభ్యర్థులు 21 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండాలి. ఈ పథకానికి అర్హులు కేవలం పేద క్రైస్తవులు మాత్రమే. వారు తమ ఉపాధి అవసరాలకు అనుగుణంగా యూనిట్ ఎంచుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ ఓఎల్ఎస్ఎంఎస్‌లో ఈ నెల 18వ తేదీ వరకు స్వీకరిస్తారు. అభ్యర్థులు అప్లికేషన్‌లో వివరాలన్నీ ఖచ్చితంగా పూరించి, అడిగిన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ సబిత, దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే అక్ నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ అవుట్‌ను భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా మహిళలు, డెలివరీ బాయ్లు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుంది.








