చైనాలోని ఒక జూ ఎలుగుబంటిలా నటించేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి 15,000 డాలర్లు (సుమారు 12.5 లక్షల రూపాయలు) జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ ఉద్యోగంలో ఎంపికైన వ్యక్తి సన్ బేర్ (మలేషియన్ ఎలుగుబంటి జాతి) లాగా ప్రవర్తించాలి. పర్యాటకులకు వెనుక కాళ్లపై నిలబడటం, చేతులూపుతూ అభివాదం చేయడం, జూ నిర్వాహకులు ఇచ్చే పండ్లను తినడం వంటి బాధ్యతలు ఉంటాయి. కానీ, తీవ్ర వేడిలో కూడా ఎలుగుబంటి ఆకారంలో ఉండే భారీ కాస్ట్యూమ్ విప్పకుండా ధరించాలి.
గతంలో హాంగ్‌జౌ జూల్లో ఎలుగుబంటి మనిషిలా నటించడం వల్ల వివాదాలు రేగాయి. ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఈ కాస్ట్యూమ్ ధరించడం ప్రాణాపాయకరమైన పరిస్థితి అని వ్యాఖ్యానిస్తున్నారు.








