సినీ తారలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ప్రభుదేవా కూడా చేరారు. MG కంపెనీ భారత్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన M9 లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఆయన కొనుగోలు చేశారు.

ఈ కారు కాంక్రీట్ గ్రే రంగులో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. 5,270 మి.మీ పొడవు, LED లైట్లు, భారీ గ్రిల్ వంటి ఫీచర్లతో రోడ్ మీద ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంటీరియర్‌లో కాగ్నాక్ థీమ్, వుడ్ ఫినిష్, కెప్టెన్ సీట్లతో సీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి.

90 kWh బ్యాటరీతో 548 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ కారు 242 bhp పవర్ కలిగి ఉంది. ధర రూ. 70.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). హేమా మాలిని, శంకర్ మహాదేవన్ వంటి సెలబ్రిటీలు ఇప్పటికే ఈ కారును కొనుగోలు చేసారు. ప్రభుదేవా కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.