ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
పనిలో మార్పులు అభివృద్ధికి దోహదపడతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
శుభకార్యాలు ఫలిస్తాయి. వివాహం, పిల్లల చదువు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వస్తువులు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం శుభం.
ఖర్చుల నియంత్రణ అవసరం. వాహన మరమ్మత్తులు, వృథా ఖర్చులు పెరిగి ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. భూ వ్యవహారాలు ఇబ్బందులు కలిగించవచ్చు. నరసింహస్వామి, రామాలయం, వినాయకుడి ఆలయాలను సందర్శించండి.
పనులలో ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. సంయమనంతో పనులు పూర్తి చేయాలి. మంచి అవకాశాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహంతో ఉండండి. శివాలయం, లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.








