చెన్నై: మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. విజయ్‌సంగీత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని రైతులను సీఎం విజయ్ కోరారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.

“ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లనే రైతులు నిరసన తెలుపుతున్నారని విజయ్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న స్టోరీ చెప్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రైతుల గౌరవాన్ని భంగం కలిగించేవిగా ఉన్నాయి. చెంగల్పట్టు కోర్టులో భర్తకోసం భార్య వెతికే కథ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసు” అంటూ ఉదయనిధి చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆగస్టు 7న తదుపరి విచారణ జరగనుంది.