మనతెలంగాణ/హైదరాబాద్ : సనత్ నగర్ టిమ్స్(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ఉద్యోగాల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. టిమ్స్ హాస్పిటల్ పరిపాలనను అత్యున్నత ప్రమాణాలతో నడిపించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ భర్తీ బాధ్యతలను ప్రభుత్వం నిమ్స్ హాస్పిటల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సనత్‌నగర్ టిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది.

కాంట్రాక్ట్/తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి గాను టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాలలో మొత్తం 122 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దాంతో పాటు వివిధ విభాగాలలో 24 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీకి, మరో 31 పోస్టుల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది.