స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైని ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో వి. నర్సింహులు ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
నిందితుడు అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని కోరినా ఎస్సై నర్సింహులు వినలేదు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎస్సై నర్సింహులుకు రూ.
50వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎసిబి అధికారులు ఎస్సైని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఎస్సైని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.








