టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరాఠీ భాష బాగా అర్థమవుతుందని, కానీ ఆయన దీనిని ఎన్నేళ్లుగా రహస్యంగా ఉంచారని నటి శిల్పా శిరోద్కర్ తెలిపారు. ఇటీవల ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె, మహేష్ తమను ఎలా ఆటపట్టించారో వివరించారు. మహేష్, నమ్రత పెళ్లైన కొత్తరోజుల్లో ఆయనకు మరాఠీ రాదని కుటుంబ సభ్యులు భావించేవారు.

దీంతో వ్యక్తిగత విషయాలు లేదా రహస్యాలు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, మహేష్ ముందే మరాఠీలో సంభాషించేవారని శిల్పా గుర్తుచేసుకున్నారు. ఆయన మాత్రం ప్రశాంతంగా వింటూ, ఏమీ అర్థం కానట్లు నటిస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు, మరాఠీలో మాట్లాడుకుంటుండగా మహేష్ అదే భాషలో 'అవునా..

నిజమా?' అని ప్రశ్నించారు. దీంతో శిల్పా, నమ్రత షాక్ అయ్యారు. ఇన్నేళ్లుగా తమ మాటలన్నీ వింటూ కూడా తెలియనట్లు నటించారని అప్పుడు అర్థమైందని శిల్పా నవ్వుతూ చెప్పారు.

అదృష్టవశాత్తూ తాము మహేష్ గురించి నెగెటివ్ విషయాలు మాట్లాడుకోలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే ఆయన మరింతగా ఆటపట్టించేవారని శిల్పా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో . మహేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కుటుంబ సభ్యులతో ఆయన అనుబంధాన్ని ఈ సంఘటన చూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సైలెంట్‌గా ఉండి అందరి సీక్రెట్స్ తెలుసుకున్న మహేష్ స్టైల్ సూపర్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.