అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఇకపై విద్యార్థులు తమ విద్యా కోర్సు లేదా డిగ్రీ పూర్తయిన తర్వాత కేవలం 30 రోజుల్లోనే అమెరికాను విడిచిపెట్టాల్సి ఉంటుంది. గతంలో ఈ గ్రేస్ పీరియడ్ 60 రోజులుగా ఉండేది.
కొత్త నిబంధనల ప్రకారం, విద్యాసంస్థలు నేరుగా వీసా పొడిగింపులను మంజూరు చేయడానికి వీలులేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీసా నిబంధనలను కఠినతరం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేస్తోంది.








