మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసిన లేఖ సాయికృష్ణ కేసు దర్యాప్తును రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సిటీ పోలీసులు, క్రిమినల్ లయబిలిటీని కేవలం సీఐపై మోపడం అనేది తప్పు అని, టాస్క్ ఫోర్స్ పాత్రను విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు.
CCTV ఫుటేజీని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్‌రైట్ అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వంటి తీవ్ర లోపాలను లేఖలో హైలైట్ చేసారు. కృష్ణలంక స్టేషన్ CCTV ఫుటేజీ నాశనం గురించి కూడా స్పష్టత కోరారు.
మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం, భారత న్యాయసంహిత సెక్షన్ 61 కింద కేసు నమోదు చేయకపోవడం వంటి విషయాలు ఆయన ప్రశ్నించారు. ఈ విమర్శలతో సాయికృష్ణ కేసు మళ్లీ రాజకీయ, పరిపాలనా చర్చల్లో ముందుకు వచ్చింది.








