హైదరాబాద్: బుగ్గపాడు భూములను ఆంధ్ర కంపెనీలకు తక్కువకు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముడుపులు తీసుకున్నారని అన్నారు. పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు దండుపాళ్యం బ్యాచ్ ను మించిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు నెరవేరలేదని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరిగాయని పువ్వాడ మండిపడ్డారు.
సీతారామ ప్రాజెక్టు మాజీ సిఎం కెసిఆర్ మానస పుత్రికని, మాజీ మంత్రి హరీష్ రావు నిర్మించిందని తెలియజేశారు. అశ్వారావుపేటకు గోదావరి జలాలు రావాలంటే కెసిఆర్ రావాల్సిందేనని డిమాండ్ చేశారు. ఖమ్మం వచ్చి కాళ్లు కడిగారు కానీ..
ఒక్క చుక్క గోదావరి నీళ్లు తేలేకపోయారని పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.








